Harish Rao: సీఎం కేసీఆర్ నాయకత్వంలో వైద్యశాఖ బలోపేతం

Harish Rao: ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు

Jyothi
Published on: 1 Dec 2022 1:33 PM IST
Harish Rao Tweet On Strengthening the Medical Department under the leadership of CM KCR
X

Harish Rao: సీఎం కేసీఆర్ నాయకత్వంలో వైద్యశాఖ బలోపేతం

Harish Rao: సీఎం కేసీఆర్ నాయకత్వంలో వైద్యశాఖ బలోపేతం అవుతోందని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తోందని ట్విట్లర్‌లో మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. అందరికీ వైద్యం అందించాలనేదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. వైద్యశాఖలో ఉద్యోగాల భర్తీకి చర్యలు ‎తీసుకుంటున్నామని ట్వీట్ చేశారు హరీశ్‌రావు.... రాష్ట్రంలోని 9 మెడికల్ కాలేజీల కోసం 3,897 పోస్టులు మంజూరు చేశామన్నారు. దీంట్లో భాంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు హరీశ్‌... ఒక్కో మెడికల్ కాలేజీకి 433 పోస్టులు భర్తీకి శ్రీకారం చుట్టామన్నారాయన. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కొమరంభీం ఆసిఫాబాద్, జనగాం, నిర్మల్ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుందన్నారు.


Jyothi

Jyothi

Next Story