తొలిసారి అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న మంత్రి హరీష్‌రావు

తొలిసారి అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న మంత్రి హరీష్‌రావు
x
Highlights

ఇవాళ ఉభయ సభల్లోనూ తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచేలా బడ్జెట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి హోదాలో హరీశ్‌రావు తొలిసారి సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారు.

ఇవాళ ఉభయ సభల్లోనూ తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచేలా బడ్జెట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి హోదాలో హరీశ్‌రావు తొలిసారి సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారు. ఉద‌యం 11.30 గంట‌ల‌కు శాసనసభలో హరీశ్‌రావు, శాస‌న‌మండ‌లిలో శాస‌న‌స‌భా వ్యవ‌హారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు. 2020-21 వార్షిక సంవత్సర బడ్జెట్‌కు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

లక్షా 56వేల కోట్ల నుంచి లక్షా 59వేల కోట్ల మధ్య బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో బడ్జెట్‌ను ఆమోదించారు. ఉదయం 11.30 గంటలకు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు.. శాసనమండలిలో రహదారులు, భవనాల శాఖ మంత్రి వి.ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2020-21కి సుమారు లక్షా 70వేల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఎన్నికల హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసేలా ఈ బడ్జెట్‌లో కేటాయింపులకు ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. సంక్షేమం, వ్యవసాయానికి సింహభాగం నిధులు దక్కనున్నాయి.

ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు కేటాయింపులు పెరగనున్నాయి. నిర్వహణ వ్యయం, లక్ష్యాల పూర్తిలో భాగంగా సాగు, తాగునీటి రంగాలకు కేటాయింపులు పెరగనున్నాయి. ఆసరా పింఛన్లకు వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించనున్న నేపథ్యంలో లబ్ధిదారులు 7 లక్షల మంది పెరగనున్నారు. దీంతో పింఛన్లకు 12 వేల కోట్ల కంటే ఎక్కువ మొత్తం ప్రతిపాదించారు.

డబల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లకు గతంలో 2లక్షల 70వేలు ప్రతిపాదించగా.. వచ్చే బడ్జెట్‌లో లక్ష ఇళ్లను కొత్తగా మంజూరు చేయనున్నారు. రుణమాఫీకి ప్రస్తుత బడ్జెట్‌లో 6 వేల కోట్లు ప్రతిపాదించారు. వచ్చే నాలుగేళ్లలో రైతు రుణమాఫీ పూర్తి చేసేలా తాజా బడ్జెట్‌లో 6 వేల కోట్లు ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల వేతన సవరణ కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే అమలు చేయాల్సి ఉంటుంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపుపైనా ప్రభుత్వం దృష్టిసారించింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories