Harish Rao: కాంగ్రెస్‌వి వారెంటీలు లేని గ్యారెంటీలు

Harish Rao: కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు.. తెలంగాణలో అమలవుతున్న పథకాలు కాపీ కొట్టినవే

Jyothi
Published on: 18 Sept 2023 8:13 AM IST
Harish Rao Strong Counter To Congress Party Over Guarantee Schemes
X

Harish Rao: కాంగ్రెస్‌వి వారెంటీలు లేని గ్యారెంటీలు

Harish Rao: కాంగ్రెస్‌ సభపై మంత్రి హరీష్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ స‌భ సాంతం ఆత్మవంచ‌న‌, ప‌ర‌నింద‌గా సాగిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీలు దేవుడెరుగని...అస‌లు కాంగ్రెస్‌కు ఓట్లు ప‌డ‌తాయ‌నే గ్యారంటే లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ విజయభేరి ఇచ్చిన హామీలు.. గాలికి పోయే పేల పిండి కృష్ణార్పణం అన్నట్టుందని దుయ్యబట్టారు.

దేశ వ్యాప్తంగా హైదరాబాద్‌లో చెప్పిన గ్యారెంటీలు అమలు చేస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారని హరీష్‌రావు ప్రశ్నించారు. హైదరాబాద్‌ సభలో చెప్పిన గ్యారెంటీలు అమలు చేస్తానని సిడబ్లూసీ సమావేశంలో తీర్మానం చేయవచ్చు కదా ఎందుకు చేయలేదని హరీష్‌రావు ట్విట్టర్‌లో ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలన్నీ తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల నుంచి కాపీ కొట్టినవే అన్నారు హరీష్ రావు.

అవినీతి గురించి కాంగ్రెస్‌ మాట్లాడటమంటే గొంగట్లో కూర్చొని తింటూ వెంట్రుకలు ఏరినట్టుందన్నారు హరీష్ రావు. కాంగ్రెస్‌ హయాంలో జరిగిన కుంభకోణాల గురించి చెప్పాలంటే.. వేలున్నాయన్నారు. స్కాంల సంస్కృతిని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ అని... ఏ కోణంలో చూసినా కాంగ్రెస్‌లో కుంభ‌కోణ‌మే క‌నిపిస్తుందన్నారు హరీష్ రావు.

Jyothi

Jyothi

Next Story