Harish Rao: తెలంగాణ చేస్తుంది.. దేశం అనుసరిస్తోంది

Harish Rao Starts Second Phase Kanti Velugu in Hyderabad
x

Harish Rao: తెలంగాణ చేస్తుంది.. దేశం అనుసరిస్తోంది

Highlights

Harish Rao: కంటివెలుగు కార్యక్రమాన్ని కూడా దేశం అనుసరించాల్సిందే

Harish Rao: తెలంగాణ చేస్తుంది.. దేశం అనుసరిస్తోందని, మన కంటివెలుగు కార్యక్రమాన్ని కూడా దేశం అనుసరించాల్సిందేనని అన్నారు మంత్రి హరీష్‌రావు. కంటివెలుగు ద్వారా ఉచితంగా కంటి పరీక్షలు చేసి, అవసరమైనవారికి అద్దాలు వారి ఇంటికే తీసుకెళ్లి ఇస్తున్నామని చెప్పారు. పార్టీలకు అతీతంగా కంటివెలుగును విజయవంతం చేయాలని, కంటివెలుగు సేవలో ప్రతిఒక్కరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు హరీష్‌రావు.

తెలంగాణలో రెండో దఫా కంటివెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. అమీర్ పేట్ లో కంటివెలుగు కార్యక్రమాన్ని మంత్రులు హరీష్ రావు, తలసాని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా 18 ఏళ్లు నిండినవారికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, మందులు, కళ్లజోళ్లను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే దీని కోసం అన్ని జిల్లాల్లో కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్యాంపులలో కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. కంటి పరీక్షల నిర్వహణకు ఏఆర్ మిషన్లు, మందులు, టార్చ్ లు, కళ్లద్దాలు, ట్యాబ్ లను పీహెచ్ సీలకు సరఫరా చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 100 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో 15 వందల బృందాలతో కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. కంటి పరీక్షలకు వచ్చేవారికి ఆధార్ కార్డ్ ను తప్పనిసరి చేశారు. నిన్న ఖమ్మంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఢిల్లీ, పంజాబ్ , కేరళ సీఎంలు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ .. పలువురికి తమ చేతుల మీదుగా కళ్లజోళ్లను పంపిణీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories