గజ్వేల్ లో రాష్ట్రస్థాయి కేసీఆర్ కప్ ఫుట్ బాల్.. ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

గజ్వేల్ లో రాష్ట్రస్థాయి కేసీఆర్ కప్ ఫుట్ బాల్.. ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
x

గజ్వేల్ లో రాష్ట్రస్థాయి కేసీఆర్ కప్ ఫుట్ బాల్.. ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

Highlights

*పోటీలను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు *కార్యక్రమంలో పాల్గొన్న వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు *కాసేపు పుట్ బాల్ ఆడిన హరీశ్ రావు - స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు

గజ్వేల్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కేసీఆర్ కప్ ఫుట్ బాల్ పోటీలను రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. వివిధ కార్పొరేషన్ చైర్మన్లు వంటేరు ప్రతాప్ రెడ్డి, ఉప్పల శ్రీనివాస్ గుప్త, స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ చైర్మన్ రోజా శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మైదానంలో స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు - మంత్రి హరీశ్ రావు కాసేపు ఫుట్ బాల్ ఆటను ఆడారు.

తెలంగాణ నలు మూలల నుంచి వచ్చిన క్రీడాకారులతో గజ్వేల్ లో రాష్ట్ర ఫుట్ బాల్ క్రీడలు జరగడం గర్వ కారణమని మంత్రి హరీశ్ రావు అన్నారు. క్రీడలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యతను ఇస్తారని, గ్రామీణ క్రీడలకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి భరోసా ఇచ్చారు.

ఆటలు ఆడితే..ఆసుపత్రులకు వెళ్లే అవసరమే రాదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని ఈ సూర్తి నిజం చేయాలంటే పిల్లలను ఆటలు ఆడించాలని సూచించారు. గజ్వేల్‌లో రాష్ట్ర స్థాయి సీఎం కప్ ఫుట్‌బాల్‌ పోటీలను ప్రారంభించారు. గజ్వేల్‌ను మంచి స్పోర్ట్స్‌ హబ్‌గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. స్పోర్స్ట్ హబ్‌ కోసం DPR సిద్ధం చేసి ప్రతిపాదన పంపాలని రాష్ట్ర స్పోర్ట్స్ కమిటీ చైర్మన్‌ వెంకటేశ్వర్లుకు మంత్రి సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories