Harish Rao: ఒక్క పథకాన్ని అయినా సంపూర్ణంగా అమలు చేస్తున్నారా?

Harish Rao: తెలంగాణలో పథకాల అమలు తీరుపై ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు మండిపడ్డారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 Aug 2024 12:18 PM IST
Harish Rao Slams Congress Govt Over Gruha Jyothi Scheme
X

Harish Rao: ఒక్క పథకాన్ని అయినా సంపూర్ణంగా అమలు చేస్తున్నారా?

Harish Rao: తెలంగాణలో పథకాల అమలు తీరుపై ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు మండిపడ్డారు. గృహజ్యోతి పథకాన్ని పూర్తిగా కాంగ్రెస్ అటకెక్కించిందని విమర్శించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు డబ్బు కొట్టుకుంటున్నారని... వాస్తవానికి పేదల నుంచి బిల్లులు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. జీరో బిల్లు జనరేట్ కాలేదన్న నెపంతో పేదల నుంచి పెండింగ్ బిల్లులు వసూళ్లు చేస్తుండటం దుర్మార్గమన్నారు.

ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట చెబుతున్నారని ఆక్షేపించారు. మేనిఫెస్టోలో చెప్పిన 6 గ్యారంటీలు 13 హామీల్లో ఒక్క పథకాన్ని అయినా సంపూర్ణంగా అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story