Harish Rao: మీ బెదిరింపులకు బీర్ఎస్ భయపడదు.. పట్నం నరేందర్‌రెడ్డి, రైతులను విడుదల చేయాలి..

Harish Rao: మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్ అన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 13 Nov 2024 10:37 AM IST
Harish Rao Serioused On Arrests Of Patnam Narender Reddy And Farmers
X

Harish Rao: మీ బెదిరింపులకు బీర్ఎస్ భయపడదు.. 

Harish Rao: మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్ అన్నారు. లగచర్ల అధికారులపై దాడి ఘటన కేసులో అరెస్ట్ చేయడాన్ని హరీష్‌రావు ఖండించారు. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటని హరీష్‌రావు మండిపట్టారు. పచ్చని పొలాల్లో ఫార్మసిటీ పేరిట చిచ్చు పెట్టడమే మీ ప్రజాపాలనా..? అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు.

నడి రాత్రి రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యమా..? అంటూ నిలదీశారు. ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులు, నిర్బంధాలతో అణిచివేయలేరన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన పట్నం నరేందర్ రెడ్డి గారిని, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని హరీష్‌రావు డిమాండ్ చేశారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story