Harish Rao: చంద్రబాబును ఏపీ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారు

Harish Rao: చంద్రబాబుకు తెలంగాణ గురించి.. తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదు

R Tripura Malini
Published on: 22 Dec 2022 2:07 PM IST
Harish Rao Sensational Comments On ChandraBabu Naidu
X

చంద్రబాబును ఏపీ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారు

Khammam: ఖమ్మంలో జరిగిన టీటీడీపీ శంఖారావంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి హరీష్‌రావు. చంద్రబాబును ఏపీ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారని, అన్ని వర్గాలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. యువతను నక్సలైట్ల పేరుతో కాల్చి చంపారని, తెలంగాణ యువత నోట్లో మట్టి కొట్టారని ఆరోపించారు. చంద్రబాబుకు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు అని, వ్యవసాయాన్ని పండగలా మార్చిన వ్యక్తి కేసీఆర్ అని హరీష్‌రావు చెప్పారు. చంద్రబాబు దెబ్బకు మహాకూటమి కూలిపోయిందన్న హరీష్‌రావు చంద్రబాబుది భస్మాసురహస్తం అని చురకలు అంటించారు. ఏపీలో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లుతుందా..? అని ప్రశ్నించారు. బీజేపీతో పొత్తు కోసమే చంద్రబాబు పాకులాడుతున్నారని విమర్శనాస్త్రాలు సంధించారు హరీష్‌రావు.

R Tripura Malini

R Tripura Malini

Next Story