Harish Rao: మీటర్లు పెట్టలేదని రూ.30 వేల కోట్లు ఆపేశారు

Harish Rao Says CM KCR is Giving Free Electricity for the Welfare of Farmers
x

Harish Rao: రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఉచిత విద్యుత్ ఇస్తున్నారు

Highlights

Harish Rao: రైతుల బోర్ల వద్ద మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి చేస్తుంది

Harish Rao: రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంటు, పెట్టుబడి సాయంగా రైతు బంధు అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా తుఫ్రాన్, మనోహరాబాద్ మండలంలో పర్యటించిన మంత్రి హరీష్ రావు.. 5 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన వ్యవసాయ గ్రీన్ మార్కెట్ యార్డును ప్రారంభించారు. రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతుల బోర్ల వద్ద మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తుందని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన 33వేల కోట్ల రూపాయలు నిలిపివేసిందని మండిపడ్డారు. బోరు బావుల వద్ద మీటర్లు పెట్టే పరిస్థితి రాదని మంత్రి హరీష్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories