Harish Rao: తెలంగాణలో జనవరి 3 నుంచి చిన్నారులకు వ్యాక్సిన్

Harish Rao: జనవరి 1 నుంచి స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని మంత్రి హరీష్‌రావు సూచన

Arun Chilukuri
Published on: 29 Dec 2021 7:16 AM IST
Harish Rao said Vaccine for children in Telangana from January 3 | TS News Online
X

తెలంగాణలో జనవరి 3 నుంచి చిన్నారులకు వ్యాక్సిన్

Harish Rao: తెలంగాణలో జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ వేయనున్నట్లు మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్ కావాల్సిన వారు జనవరి 1 నుంచి కోవిన్ పోర్టల్‌లో ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. 2007 కంటే ముందు పుట్టిన పిల్లలందరికీ కరోనా వ్యాక్సిన్ ఇస్తామని మంత్రి వెల్లడించారు. పీహెచ్‌సీలు, వైద్య కాలేజీల్లో టీకాలు వేస్తామని మంత్రి హరీష్‌రావు చెప్పారు. తెలంగాణలో 15-18 ఏళ్ల చిన్నారులు 22.78 లక్షల మంది ఉన్నారని 61 ఏళ్లు దాటిన వారు 41.60 లక్షల మంది ఉన్నారని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story