Harish Rao: కొండా సురేఖ వ్యాఖ్యలపై హరీష్ రావు రియాక్షన్

Harish Rao: కొండా సురేఖ వ్యాఖ్యలపై హరీష్ రావు రియాక్షన్
X

Harish Rao to Minister Konda Surekha: నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్ పాత్ర ఉందని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. హీరోయిన్స్ కి కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేశారని, కేటీఆర్ వల్ల ఎంతోమంది ఇబ్బందిపడ్డారని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయవర్గాల్లో ఇటు సినీ పరిశ్రమలో దుమారానికి కారణమయ్యాయి. ఇదే అంశంపై తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు స్పందించారు. మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ హరీష్ రావు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తన ట్వీట్‌లో కొండా సురేఖను ట్యాగ్ చేసిన హరీష్ రావు.. తక్షణమే ఆమె బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా నిన్ను విమర్శించడానికి ఏమీ లేనప్పుడే నిన్ను వ్యక్తిగతంగా దూషిస్తారంటూ మార్గరెట్ థాచర్ కొటేషన్‌ని హరీష్ రావు ఎటాచ్ చేశారు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story