Harish Rao: నిర్మలా సీతారామన్‌కు హరీష్‌రావు సవాల్‌.. నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం..

Harish Rao: తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్‌లో చేరలేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం పచ్చి అబద్దమన్నారు మంత్రి హరీష్‌రావు.

Arun Chilukuri
Published on: 2 Sept 2022 3:38 PM IST
Harish Rao Open Challenge To Nirmala Sitharaman
X

Harish Rao: నిర్మలా సీతారామన్‌కు హరీష్‌రావు సవాల్‌.. నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం..

Harish Rao: తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్‌లో చేరలేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం పచ్చి అబద్దమన్నారు మంత్రి హరీష్‌రావు. అలాంటప్పుడు తెలంగాణకు ఆయుష్మాన్ భారత్ కింద 150 కోట్లు నిధులను ఎందుకు విడుదల చేశారో మంత్రి నిర్మలా సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్‌లో చేరలేదని మంత్రి అధికారికంగా చెప్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధమన్నారు మంత్రి హరీష్‌రావు. లేదంటే మంత్రి నిర్మలా భేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు.

దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్నారు మంత్రి హరీష్‌రావు. కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధుల కంటే..రాష్ట్రమే కేంద్రానికి ఇచ్చిన నిధుల వాటా అత్యధికమన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 3లక్షల కోట్లకుపైగా నిధులను కేంద్రానికి ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానికి అన్నారు మంత్రి హరీష్‌రావు. అలాంటప్పుడు సీఎం కేసీఆర్ ఫోటోను కేంద్రమే పెట్టుకోవాలని సూచించారు. నిర్మలా సీతారామన్ చేస్తున్న వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవంలేదన్నారు మంత్రి హరీష్‌రావు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story