Harish Rao: అసెంబ్లీ స్పీకర్ శ్రీనివాస్‌రెడ్డిని కలిసిన మంత్రి హరీష్‌రావు

Harish Rao: అసెంబ్లీకి చేరుకున్న మంత్రి హరీష్‌రావు

Dhatripriya
Published on: 6 Feb 2023 9:50 AM IST
Harish Rao Met Assembly Speaker Srinivas Reddy
X

Harish Rao: అసెంబ్లీ స్పీకర్ శ్రీనివాస్‌రెడ్డిని కలిసిన మంత్రి హరీష్‌రావు

Harish Rao: కాసేపట్లో తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు మంత్రి హరీష్‌రావు. జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజల అనంతరం హరీష్‌రావు అసెంబ్లీకి చేరుకున్నారు. అనంతరం మంత్రి ప్రశాంత్‌రెడ్డితో పాటు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిశారు. ఆయనకు బడ్జెట్ ప్రతులను అందజేశారు. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తూ పాలన అందిస్తున్నామని అన్నారు మంత్రి హరీష్‌రావు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిస్తోందని, కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందనప్పటికీ సొంతకాళ్లపై నిలబడి ప్రజలకు ఇచ్చిన హామీలు, ఆకాంక్షలను నిలబెట్టే విధంగా ముందుకెళ్తున్నామని అన్నారు మంత్రి హరీష్‌రావు. తెలంగాణ పథకాలు, అభివృద్ధిని దేశం మొత్తం ప్రశంసిస్తోందని చెప్పిన హరీష్‌రావు తెలంగాణ బడ్జెట్‌ దేశానికి మోడల్‌గా నిలుస్తుందన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story