Sangareddy: సీపీఎం ముఖ్యనేతలతో హరీష్ రావు సమావేశం

Sangareddy: సంగారెడ్డి సీపీఎం పార్టీ జిల్లా కార్యాలయానికి మంత్రి హరీష్‌రావు

Jyothi
Published on: 17 Nov 2023 10:39 AM IST
Harish Rao Meeting with CPM Leaders
X

Sangareddy: సీపీఎం ముఖ్యనేతలతో హరీష్ రావు సమావేశం

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో సీపీఎం పార్టీ పోటీ చేయని స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు తెలిపాలని సీపీఎం ముఖ్య నేతలను మంత్రి హరీష్ రావు కోరారు. సంగారెడ్డి జిల్లా సీపీఎం పార్టీ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్‌తో కలిసి మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. జిల్లాలో సీపీఎం పార్టీ అభ్యర్థులు పోటీ చేయని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని హరీష్‌రావు కోరారు.

సానుకూలంగా స్పందించిన సీపీఎం పార్టీ ముఖ్య నేతలు పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతకు ముందు పార్టీకి రాజీనామా చేసిన బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేశ్‌పాండే నివాసానికి మంత్రి హరీష్ రావు వెళ్లారు. ఆయనను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. దేశ్ పాండే అనుచరులు మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

Jyothi

Jyothi

Next Story