Harish Rao: కేంద్ర మంత్రి నిర్మలసీతామన్‌కు మంత్రి హరీష్ రావు లేఖ

Harish Rao: ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాసిన స్పందన లేదు

Dhatripriya
Published on: 22 Jan 2023 2:08 PM IST
Harish Rao Letter To Union Minister Nirmala Seethaman
X

Harish Rao: కేంద్ర మంత్రి నిర్మలసీతామన్‌కు మంత్రి హరీష్ రావు లేఖ

Harish Rao: కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌కు మంత్రి హరీష్‌రావు లేఖ రాశారు. ఏపీ బదలాయించిన 495 కోట్ల సీఎస్‌ఎస్‌ నిధులు తిరిగి ఇప్పించాలని లేఖలో ప్రస్తావించారు. ఇప్పటికే కేంద్రానికి అనేక సార్లు లేఖలు రాసినా స్పందన లేదని ఇప్పటికైనా స్పందించి సీఎస్‌ఎస్‌ నిధులు తెలంగాణకు తిరిగి ఇప్పించాలని హరీష్‌ రావు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటి సంవత్సరంలో కేంద్రం నుంచి వచ్చే నిధులను ఏపీ, తెలంగాణ మధ్య జనాభా ప్రాతిపదికన విభజించారని, అయినా పొరపాటున మొత్తం సీఎస్ఎస్ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేశారని గుర్తు చేశారు. దీంతో తెలంగాణ నష్టపోయిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు అకౌంటెంట్ జనరల్ దృష్టికి తీసుకువెల్లిందన్నారు. ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా 495 కోట్లను తెలంగాణకు ఇంకా సర్దుబాటు చేయలేదని మంత్రి హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్‌కు మంత్రి హరీష్ రావు లేఖలో విన్నవించారు.

Dhatripriya

Dhatripriya

Next Story