Harish Rao: కులగణన నుంచి వారిని మినహాయించండి.. సీఎం రేవంత్‌కు హరీష్ లేఖ..

Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 Nov 2024 5:11 PM IST
Harish Rao Letter To Revanth Reddy
X

Harish Rao: కులగణన నుంచి వారిని మినహాయించండి.. సీఎం రేవంత్‌కు హరీష్ లేఖ..

Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. కుటుంబ సర్వే నుంచి ప్రైమరీ స్కూల్ టీచర్లను మినహాయించాలని లేఖలో డిమాండ్ చేశారు. సర్వే కోసం ప్రైమరీ స్కూల్ టీచర్ల సేవలను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించడం విద్యా హక్కు చట్టం ఉల్లంఘనే అన్నారు హరీష్‌రావు.

సర్వే పేరుతో టీచర్లు, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తూ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 36వేల 559 SGT, 3414 మంది ప్రధానోపాధ్యాయులను ఈ సర్వేలో భాగం చేస్తూ విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధం అన్నారు. అకస్మాత్తుగా ఒంటి పూట బడులు నడపడం వలన పిల్లలకే కాకుండా తల్లిదండ్రులకు కూడా ఇబ్బందులు ఉంటాయన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story