కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీష్‌రావు మండిపాటు

Harish Rao: బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతోంది

Jyothi
Published on: 26 Aug 2022 2:01 PM IST
Harish Rao Fire On BJP | TS News
X

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీష్‌రావు మండిపాటు

Harish Rao: కేంద్ర ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు మంత్రి హరీ‌ష్‌రావు. తెలంగాణ భూముల్లో కృష్ణ, గోదావరి జలాలు పారాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చూస్తుంటే.. రక్తం పారాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని ఫైర్‌ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం పరిపాలనను గాలికి వదిలేసి ప్రతిపక్షాలపై పడటమే పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు. దేశంలో పరిస్థితులను చూస్తుంటే.. దర్యాప్తు సంస్థలు బీజేపీ జేబు సంస్థలుగా మారాయా..? అనే అనుమానం కలుగుతోందని ఆరోపించారు హరీష్‌రావు.

Jyothi

Jyothi

Next Story