Harish Rao: ఆ 39 మంది కానిస్టేబుళ్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 28 Oct 2024 1:34 PM IST
Harish Rao Demands Govt Should Lift Suspension On Telangana Special Police
X

Harish Rao: ఆ 39 కానిస్టేబుళ్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 మంది పోలీసులను సర్వీస్ నుండి తొలగించడం పట్ల ఆయన మండిపడ్డారు. ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఒకే పోలీసు విధానాన్ని అమలు చేయాలని కోరితే.. 10 మంది కానిస్టేబుళ్లను సర్వీస్ నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం హేయమైన చర్యను ఖండిస్తున్నామని అన్నారు.

సీఎం రేవంత్ అధికారంలోకి వచ్చాక పోలీసుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. వారి ఆవేదన ఎందుకు అర్థం చేసుకోవడం లేదని అన్నారు. 10 మందిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించుకొని, సస్పెండ్ చేసిన 39 మంది కానిస్టేబుళ్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు అన్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story