Harish Rao: రేవంత్‌, రాహుల్ తెలంగాణపై విషం చిమ్ముతున్నారు

Harish Rao: నల్గొండ జిల్లాలో 12 స్థానాలతో చరిత్ర సృష్టించాలి

Shekhar G
Published on: 21 Oct 2023 6:07 PM IST
Harish Rao Comments On Revanth Reddy And Rahul Gandhi
X

Harish Rao: రేవంత్‌, రాహుల్ తెలంగాణపై విషం చిమ్ముతున్నారు

Harish Rao: రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ తెలంగాణపై విషం చిమ్ముతున్నారని మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ గెలిస్తే కరువు, కర్ఫ్యూలు తప్ప ఇంకేం ఉండవన్నారు. కోట్లకు టికెట్లు అమ్ముకున్న కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని ముంచుతుందని హరీష్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ పథకాలను కాంగ్రెస్ కాపీ కొట్టిందని,, కర్నాటకలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. రాహుల్ గాంధీ.. రాంగ్ గాంధీగా పేరు మార్చుకోవాలని హరీష్ రావు ఎద్దేవా చేశారు. మళ్లీ కేసీఆర్ గెలిస్తేనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు ఆయన. కాంగ్రెస్‌ను నుంచి బీఆర్ఎస్‌లో చేరిన సుధాకర్‌కు మంత్రి కేటీఆర్, హరీష్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Shekhar G

Shekhar G

Next Story