Harish Rao: ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలైనా తులం బంగారం ఇవ్వలేదు

Harish Rao: షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు కూడా పంపిణీ చేసిన హరీష్‌రావు

Shashank Gullapelli
Published on: 8 March 2024 3:40 PM IST
Harish Rao Comments On Congress Govt
X

Harish Rao: ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలైనా తులం బంగారం ఇవ్వలేదు

Harish Rao: తెలంగాణలోని ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ఓట్లు వేయించుకుందన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు హరీష్‌రావు. తర్వాత బాబు జగ్జీవన్‌రావు భవన్‌లో మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలైనా ఆడపిల్లల పెళ్లిళ్లకు బంగారం ఇవ్వలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఉండకపోతే గ్రామాల్లోని చెరువులు ఎండిపోయి ఉండేవన్నారు. ప్రస్తుత తమ ప్రభుత్వం లేకపోవడంతో తన నియోజకవర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు హరీష్‌రావు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story