Harish Rao: ఎన్నికల సమయంలో అబద్ధాలు హామీలు ఇచ్చారు.. కనీసం పాలనలోనైనా నిజాయితీ కనబర్చాలి

Harish Rao: కాంగ్రెస్ పాలకుల అహంకారాన్ని ప్రజలు ఎక్కువ రోజులు సహించరు

Shekhar G
Published on: 2 Feb 2024 6:47 PM IST
Harish Rao Comments on Congress Government
X

Harish Rao: ఎన్నికల సమయంలో అబద్ధాలు హామీలు ఇచ్చారు.. కనీసం పాలనలోనైనా నిజాయితీ కనబర్చాలి

Harish Rao: కాంగ్రెస్ పాలకుల్లో ఇప్పుడే అసహనం కనిపిస్తోందని, అధికారంలో ఉన్నామనే అహంకారం ఎక్కువైందని మాజీ మంత్రి హరీష్ రావు దుయ్యబట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.. కాంగ్రెస్ పాలకుల అహంకారాన్ని ప్రజలు ఎక్కువ రోజులు సహించరని అన్నారాయన.. ఎన్నికల సమయంలో అబద్ధాలు హామీలు ఇచ్చినా.

కనీసం పాలనలోనైనా నిజాయితీ కనబర్చాలని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు హితవు పలికారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేస్తున్నారా.. అని ప్రశ్నించారాయన.. గ్రూప్స్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారని, దానికి కాంగ్రెస్ నాయకులు సమాధానం ఇవ్వడం లేదన్నారు. వృద్ధులు, వికలాంగులకు ఇవ్వాల్సిన పెన్షన్లను కూడా సక్రమంగా ఇవ్వడం లేదని హరీశ్ ఆరోపించారు.

Shekhar G

Shekhar G

Next Story