Harish Rao: కాంగ్రెస్, బీజేపీ ఏనాడైనా నీళ్లు తెచ్చారా?

Harish Rao: కాంగ్రెస్ గ్యారెంటీల పేరుతో మోసం చేస్తోంది

Shekhar G
Published on: 20 Nov 2023 3:28 PM IST
Harish Rao Comments On BJP And Congress
X

Harish Rao: కాంగ్రెస్, బీజేపీ ఏనాడైనా నీళ్లు తెచ్చారా?

Harish Rao: కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ నాయకులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని.. తమ సొంత పార్టీ నాయకులకే బీజేపీ మీద నమ్మకం లేదన్నారు. బీజేపీ నాయకులు చెప్పే మాటలన్నీ నీటి మీద రాతలేనని గత ఎన్నికల్లో ఆ పార్టీ ఒక టికెట్ అయినా గెలుచుకోగలిగింది. కానీ ఈసారి డకౌటే అని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏదైనా ఇచ్చిందా అంటే అది జీఎస్టీనేన్నారు. కాంగ్రెస్, బిజెపి వాళ్ళు ఏనాడైనా నీళ్లు తెచ్చారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల పేరుతో మోసం చేస్తోందని కర్నాటకలోనూ ఐదు గ్యారెంటీల పేరుతో మోసం చేశారని..ఎన్నికలు పూర్తయ్యాక అటువైపు కూడా చూడటం లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ పరిస్థితి కూడా అలాగే మారుతుందని హెచ్చరించారు. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోవాలంటే మరోసారి కేసీఆర్‌నే గెలిపించాలన్నారు.

Shekhar G

Shekhar G

Next Story