Harish Rao: పేపర్ లీక్ చేసి బండి సంజయ్ పట్టపగలు దొరికిపోయారు

Harish Rao: బండి సంజయ్ మీద అనర్హత వేటు వేయాలి

Jyothi
Published on: 5 April 2023 1:11 PM IST
Harish Rao Comments On Bandi Sanjay
X

Harish Rao: పేపర్ లీక్ చేసి బండి సంజయ్ పట్టపగలు దొరికిపోయారు

Harish Rao: బండి సంజయ్ అరెస్టుపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. పేపర్ లీక్ చేసింది బీజేపీ కార్యకర్త ప్రశాంతేనని అన్నారు. టెన్త్ పేపర్ లీక్ చేయించి బండి సంజయ్ పట్టపగలు దొరికిపోయారంటూ ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు సిగ్గుతో తలగించుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీక్ కు సంబంధించి అన్ని ఆధారాలు పోలీసులు గుర్తించారని తెలిపారు.

నిందితులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హరీశ్ రావు అన్నారు. బండి సంజయ్ పై అనర్హత వేటు వేయాలని కేంద్రాన్ని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు కుట్రలు మానుకోవాలని... తెలంగాణ ప్రజలకు, విద్యార్థి లోకానికి బీజేపీ క్షమాపణలు చెప్పాలని హరీశ్ రావు అన్నారు.

Jyothi

Jyothi

Next Story