Harish Rao: సందడిగా హుజురాబాద్ సిటీ ప్యాలెస్

*చాయ్ తాగి సేద తీరిన మంత్రి హరీష్ రావు *హోటల్ యజమానిని అబ్దుల్ బాయ్ అంటూ పిలిచిన మంత్రి

Shilpa
Updated on: 10 Oct 2021 8:00 PM IST
Harish Rao at Huzurabad City Palace
X

చాయ్ తాగి సేద తీరిన మంత్రి హరీష్ రావు(ఫైల్ ఫోటో)

Harish Rao: మంత్రి హరీష్ రావు రాకతో హుజురాబాద్ సిటీ ప్యాలెస్ సందడిగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ కార్య‌క్రమానికి హాజ‌రై తిరిగి వెళ్తుండ‌గా చాయ్ తాగేందుకు సిటీ ప్యాలెస్ వ‌ద్ద ఆగారు మంత్రి. నేరుగా హోట‌ల్‌లోకి వెళ్లి య‌జ‌మానిని అబ్దుల్ బాయ్ అంటూ ప‌ల‌క‌రించే స‌రికి అత‌డు ఆనందంలో మునిగితేలాడు. చాయ్ తాగుతూ హోటల్ యజమానితో కాసేపు ఆత్మీయంగా మాట్లాడారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హోటల్ యజమాని అబ్ధుల్‌తో పాటు అక్కడున్న యువకులతో సెల్ఫీలు దిగారు మంత్రి హరీష్ రావు.

Shilpa

Shilpa

Next Story