Harish Rao: ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే రేవంత్‌కు సన్మానం చేస్తా..

Harish Rao: రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ బౌన్స్ అయిందని, వారికి శిక్ష పడాల్సిందేనని... అందుకే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.

Arun Chilukuri
Updated on: 3 May 2024 7:31 PM IST
Harish Rao Accepted Revanth Reddy Challenge
X

Harish Rao: ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే రేవంత్‌కు సన్మానం చేస్తా..

Harish Rao: రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ బౌన్స్ అయిందని, వారికి శిక్ష పడాల్సిందేనని... అందుకే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీతో చేతులు కలిపారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి అహంకారం వచ్చిందని మండిపడ్డారు. న‌ర్సాపూర్ నియోజ‌క‌వ‌ర్గం దౌల్తాబాద్‌లో నిర్వహించిన రోడ్ షోలో ముఖ్యమంత్రిపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి కేవ‌లం ప‌ద‌వుల కోసం, పార్టీల కోసం జ‌రుగుతున్న ఎన్నిక‌లు కాదని... తెలంగాణ భవిష్యత్తు కోసం జరుగుతున్న ఎన్నికలు అని పేర్కొన్నారు.

అధికారంలోకి వ‌చ్చేందుకు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని... కానీ ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని హరీశ్ రావు పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మరోసారి తెలిపారు. పంద్రాగస్టు లోగా కాంగ్రెస్‌ ఇచ్చిన 6 గ్యారంటీలు, రుణమాఫీ అమలు చేస్తే.. రాజీనామా చేస్తానని పునరుద్ఘాటించారు. ఆరు గ్యారంటీలు, రుణమాఫీ అమలు చేస్తే సిద్దిపేటలో రేవంత్‌రెడ్డికి సన్మానం చేస్తానని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story