Harish Rao: అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ

Harish Rao: వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాన్ని అన్ని బ్యాంకులు చేరుకోవాలి

Dhatripriya
Published on: 19 May 2023 6:02 PM IST
Harish Rao About Telangana Development
X

Harish Rao: అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ

Harish Rao: ఈ ఏడాది వార్షిక రుణ లక్ష్యాన్ని బ్యాంకులు 2 లక్షల 42వేల 775 కోట్లుగా నిర్ధారించడం సంతోషంగా ఉందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో వంద శాతం జిల్లాలు డిజిటల్‌ జిల్లాలుగా గుర్తింపు పొందడం గొప్ప విషయమని హర్షం వ్యక్తం చేశారు. టీ-హబ్‌లో జరిగిన రాష్ట్ర బ్యాంకర్ల సమితి సమావేశంలో హరీశ్‌ రావుతో పాటు మంత్రి నిరంజన్‌ రెడ్డి పాల్గొన్నారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశంలో తెలంగాణ.. అనతి కాలంలోనే దేశానికే మార్గదర్శిగా నిలిచిందని కొనియాడారు. పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ కల్పనలో అగ్రస్థానంలో నిలుస్తూ.. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో గణనీయమైన వృద్ధిని సాధించామని మంత్రి హరీష్ రావు వివరించారు.

Dhatripriya

Dhatripriya

Next Story