Harish Rao: వైద్య, ఆరోగ్య రంగంలో దేశానికి తెలంగాణ దిక్సూచి

Harish Rao: ప్రస్తుతం రాష్ట్రంలో 102 డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయి

Dhatripriya
Published on: 20 April 2023 4:07 PM IST
Harish Rao About Health And Education In Telangana
X

Harish Rao: వైద్య, ఆరోగ్య రంగంలో దేశానికి తెలంగాణ దిక్సూచి

Harish Rao: వైద్య, ఆరోగ్య రంగంలో దేశానికి తెలంగాణ దిక్సూచిలా మారిందన్నారు మంత్రి హరీష్‌రావు. ప్రభుత్వాసుత్రుల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తున్నట్లు తెలిపారాయన. నాంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్, రక్త నిధి కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. గతంలో కేవలం మూడు డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉండేవని.. ఇప్పుడు వాటిని 102కు పెంచామన్నారు. డయాలసిస్ పేషెంట్లకు నెలకు 2 వేల పెన్షన్ ఇస్తూ..అన్ని రకాలుగా అండగా ఉంటున్నామని తెలిపారాయన.

Dhatripriya

Dhatripriya

Next Story