కొత్తపేట సౌత్ ఇండియా షాపింగ్‌ మాల్‌లో సోదాలు

*హ్యాండ్లూమ్ టెక్స్‌టైల్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడులు

Jyothi
Published on: 17 Nov 2022 4:01 PM IST
Handloom Textiles Enforcement Officers Raid South India Shopping Mall in Kothapet
X

కొత్తపేట సౌత్ ఇండియా షాపింగ్‌ మాల్‌లో సోదాలు 

South India Shopping Mall: హైదరాబాద్‌లోని కొత్తపేట సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌లో హ్యాండ్లూమ్ టెక్స్‌టైల్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. నకిలీ హ్యాండ్లూమ్‌ వస్త్రాలు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు సోదాలు చేపట్టారు. చేనేత పరిరక్షణ చట్టం ప్రకారం.. 11 రకాల హ్యాండ్లూమ్ వస్త్రాలు తయారు చేసే అధికారాన్ని.. చేనేత కార్మికులకు రిజర్వ్ చేశామని అధికారులు చెబుతున్నారు. కానీ ఈ మాల్‌లో హ్యాండ్లూమ్స్‌ నుంచి కాకుండా.. మరమగ్గాల నుంచి తయారైన వాటిని చేనేత వస్త్రాల పేరుతో విక్రయిస్తున్నారని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. షాపు యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Jyothi

Jyothi

Next Story