TG Muncipal Elections Results 2026: హాలియాలో కాంగ్రెస్ జైత్రయాత్ర: 11 వార్డుల్లో హస్తం విజయం.. బీఆర్ఎస్ క్లీన్ అవుట్!

TG Muncipal Elections Results 2026:

Arun Chilukuri
Published on: 13 Feb 2026 10:52 AM IST
TG Muncipal Elections Results 2026: హాలియాలో కాంగ్రెస్ జైత్రయాత్ర: 11 వార్డుల్లో హస్తం విజయం.. బీఆర్ఎస్ క్లీన్ అవుట్!
X

TG Muncipal Elections Results 2026: నల్గొండ జిల్లాలోని హాలియా మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 12 వార్డులున్న ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్లింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానానికే పరిమితమైంది.

వార్డుల వారీగా విజేతలు మరియు మెజారిటీ వివరాలు:

హాలియా మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయం సాధించారు. వివరాలు ఇలా ఉన్నాయి:

1వ వార్డు: రాజ రమేష్ యాదవ్ (కాంగ్రెస్) - 296 ఓట్ల మెజారిటీతో విజయం.

2వ వార్డు: నకిరేకంటి అన్నపూర్ణ (కాంగ్రెస్) విజయం.

3వ వార్డు: కుందూరు వెంకట్ రెడ్డి (కాంగ్రెస్) - 243 ఓట్ల మెజారిటీతో విజయం.

4వ వార్డు: కడమంచి ప్రమీల (బీఆర్ఎస్) విజయం. (బీఆర్ఎస్ గెలిచిన ఏకైక వార్డు)

5వ వార్డు: చిట్టిపోలు శ్రీ దేవి (కాంగ్రెస్) - 250 ఓట్ల మెజారిటీతో విజయం.

6వ వార్డు: బొంగరాల యేసు రాజు (కాంగ్రెస్) - 358 ఓట్ల మెజారిటీతో విజయం.

7వ వార్డు: చింతల చంద్రారెడ్డి (కాంగ్రెస్) - 651 ఓట్ల మెజారిటీతో భారీ విజయం.

8వ వార్డు: జాన్విన్ (కాంగ్రెస్) - 53 ఓట్ల మెజారిటీతో విజయం.

9వ వార్డు: చెరుకుపల్లి ముత్యాలు (కాంగ్రెస్) విజయం.

10వ వార్డు: పిల్లి చంద్రకళ (కాంగ్రెస్) - ఏకగ్రీవం.

11వ వార్డు: దేపావత్ ప్రసాద్ (కాంగ్రెస్) విజయం.

12వ వార్డు: ఎడవెల్లి మేరీ (కాంగ్రెస్) విజయం.

హాలియాలో కాంగ్రెస్ జైత్రయాత్రతో నల్గొండ జిల్లాలో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. అభివృద్ధి పనులే తమను గెలిపించాయని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story