Weather Report: తెలంగాణలో మూడు రోజులు వడగళ్ల వానలు..!

Weather Report: హెచ్చరించిన వాతావరణ శాఖ.. ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ

Jyothi
Published on: 25 April 2023 7:54 PM IST
Hail Rains for Three Days in Telangana
X

Weather Report: తెలంగాణలో మూడు రోజులు వడగళ్ల వానలు..!

Weather Report: తెలంగాణలో రాగల మూడు రోజులు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్‌, పలు జిల్లా ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.

Jyothi

Jyothi

Next Story