హఫీజ్‌పేట్‌ ల్యాండ్‌ మాకు సంబంధించినదే : విఖ్యాత్‌ రెడ్డి

Arun Chilukuri
Updated on: 8 Jan 2021 5:28 PM IST
హఫీజ్‌పేట్‌ ల్యాండ్‌ మాకు సంబంధించినదే : విఖ్యాత్‌ రెడ్డి
X

హపీజ్ పేట్‌ ల్యాండ్ తమకి చెందినదే అని అఖిల ప్రియ సోదరుడు విఖ్యాత్ రెడ్డి అన్నారు. ఈ భూ వివాదం ఎప్పటి నుంచో ఉందని తెలిపారు. ప్రవీణ్‌, నవీన్, సునీల్ మా నాన్న వద్ద లాయర్లుగా పనిచేశారని..మా నాన్న పోయాక ఏవీ సుబ్బారెడ్డితో కుమ్మక్కయ్యారు అని తెలిపారు. బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ అరెస్టయిన నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు. అఖిలప్రియకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా ఇబ్బంది పెడుతున్నారన్నారు. తన సోదరిపై తప్పుడు సెక్షన్లతో కేసులు పెట్టారని జగత్‌ విఖ్యాత్‌ ఆరోపించారు. అసలేమాత్రం సంబంధం లేని కేసులో అరెస్ట్‌ చేశారన్నారు. తమను ఇంతలా భయపెట్టి ఏం సాధించదలచుకున్నారని ఆయన ప్రశ్నించారు. భూమా కుటుంబాన్ని ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆస్తులు కాజేయలనే ప్రయత్నం చేస్తున్నారని, తమపై ఏపీ, తెలంగాణలో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story