ఎమ్మెల్సీలకు ప్రొటోకాల్ ఉల్లంఘనపై గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆగ్రహం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై సమీక్ష

Dhatripriya
Published on: 1 Feb 2023 5:19 PM IST
Gutta Sukhender Reddy Is Angry On Violation Of MLC Protocol
X

Telangana News: ఎమ్మెల్సీలకు ప్రొటోకాల్ ఉల్లంఘనపై గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆగ్రహం

Gutha Sukender Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, కౌన్సిల్ ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశాల నిర్వహణ, భద్రత ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమీక్షలో అధికారులపై మండలి ఛైర్మన్ గుత్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలకు ప్రొటోకాల్ ఉల్లంఘన జరుగుతుందని అసహనం వ్యక్తం చేశారు. సెక్రటరీ ద్వారా ఫిర్యాదులు ఇచ్చినా చర్యలు తీసుకోలేదన్నారు. స్వయంగా తనకే కొన్నిసార్లు అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిల్ ఛైర్మన్ ఫిర్యాదుతో చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.

Dhatripriya

Dhatripriya

Next Story