Telangana: వైఎస్ షర్మిల టీఆర్ఎస్ పై చేసిన వ్యాఖ్యలకు గుత్తా కౌంటర్

Telangana: తెలంగాణను దోచుకునేందుకు కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి- గుత్తా

Sandeep Eggoju
Updated on: 10 April 2021 1:45 PM IST
Gutta Sukender Reddy Counter to YS Sharmila Comments on TRS
X

గుత్తా సుఖేందర్ రెడ్డి  & వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

Telangana: శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో వైఎస్ షర్మిల టీఆర్ఎస్ పై చేసిన వ్యాఖ్యలకు గుత్తా కౌంటర్ ఇచ్చారు. దుర్బుద్దితో తెలంగాణను దోచుకునేందుకు కొత్త కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయని ఆరోపించారు. ఎవరి హయాంలో అయితే హైదరాబాద్‌ అల్లాకల్లొలం చేసి ఫ్యాక్షన్ రాజకీయాలను తెచ్చారో వారే ఇవ్వాళ పార్టీ స్థాపిస్తామంటూ నీతి వ్యాఖ్యలు వల్లిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో సుస్థిర ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విరుచుకుపడ్డారు. కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య భేదాభిప్రాయాలు, అలజడి సృష్టించే పన్నాగాలు ఇక్కడ సాగవని, ఇలాంటి కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొడతారని హెచ్చరించారు.

ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నందని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అందులో దేశంలోనే నెంబర్ వన్గా ఉందన్నారు. ఆంధ్రాపాలనలో తెలంగాణ ప్రజలు దోపిడీకి గురయ్యారని చెప్పారు. పోతిరెడ్డిపాడు, సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా నీటి దోపిడి చేసిందెవరని ప్రశ్నించారు. గడీల పాలన తెలంగాణలో లేదని. పులివెందులలోనే ఉందని వైఎస్ షర్మిలను ఉద్దేశించి అన్నారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదని. రాజకీయ లబ్ది పొందాలని చూసే వాళ్ల పప్పులు ఇక్కడ ఉడకవని తీవ్రంగా హెచ్చరించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story