ఉత్స‌వ విగ్ర‌హంలా కిష‌న్ రెడ్డి.. ఎమ్మెల్సీ గుత్తా ఫైర్‌..

Gutha Sukender Reddy: కేంద్రంపై ఫైరయ్యారు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి. కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 8 Feb 2022 11:57 AM IST
Gutha Sukender Reddy Slams BJP
X

ఉత్స‌వ విగ్ర‌హంలా కిష‌న్ రెడ్డి.. ఎమ్మెల్సీ గుత్తా ఫైర్‌..

Gutha Sukender Reddy: కేంద్రంపై ఫైరయ్యారు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి. కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర విభజన హామీలను కేంద్రం గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రాజ్యాంగం గురించి మాట్లాడితే బీజేపీ నేతలు పెడర్దాలు తీస్తున్నారని, అంబేద్కర్ స్ఫూర్తితోనే రాజ్యాంగంలో పున:సమీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంస్థలు అమ్ముకోవడం తప్పా దేశ అభివృద్ధి చేయాలన్న సోయి కేంద్ర సర్కార్ కు లేదని ధ్వజమెత్తారు.

కేసీఆర్ చెప్పే ప్రతి మంచి మాటను వివాదం చేయడమే పనిగా పెట్టుకున్న బీజేపీ నేతలకు, ప్రజలు సరైన సమయంలో గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు సుఖేందర్ రెడ్డి. రాష్ట్రం నుంచి కేంద్ర‌మంత్రిగా ఉన్న కిష‌న్ రెడ్డి ఉత్స‌వ విగ్ర‌హంలా మారిపోయాడు అని గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి విమ‌ర్శించారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు కిష‌న్ రెడ్డికి ప‌ట్ట‌వు అని కోపోద్రిక్తుల‌య్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story