టీపీసీసీ అధ్యక్షుడిపై గుత్తా సుఖేందర్ రెడ్డి హాట్ కామెంట్స్

Gutha Sukender: ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి ఉత్తర కుమారుడు వచ్చాడని అందులో ఏమి లేదని ఎద్దెవా చేశారు.

Sandeep Eggoju
Published on: 27 Jun 2021 2:40 PM IST
Gutha Sukender Hot Comments on Telangana Congress Party President
X
గుత్తా సుఖేందర్ రెడ్డి (ఫోటో ది హన్స్ ఇండియా)

Gutha Sukender: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికపై గుత్తా సుఖేందర్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి ఉత్తర కుమారుడు వచ్చాడని అందులో ఏమి లేదని ఎద్దెవా చేశారు. కాంగ్రెస్ పార్టీని సరి చేయడానికి పుణ్యకాలం సరిపోతుందని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని జోస్యం చెప్పారు. నీళ్ల విషయంలో మొదటి నుండి తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉందని అన్నారు. కాళేశ్వర జలాలతో సూర్యాపేట జిల్లాలోని వందల ఎకరాల భూమికి సాగు నీరు వచ్చి చేరిందని, బస్వాపూర్ ప్రాజెక్టు పూర్తి చేసి యాదాద్రి జిల్లాకు సాగు నీరు అందించడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు గుత్తా సుఖేందర్‌రెడ్డి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story