Hyderabad: కూకట్‌పల్లిలో కాల్పుల కలకలం..భారీ దోపిడీకి కుట్ర

Hyderabad: హైదరాబాద్ కూకట్‌పల్లిలో కాల్పుల కలకలం రేపాయి.

Samba Siva Rao
Published on: 29 April 2021 3:35 PM IST
Kukatpally Gun Fire Atm cash Center
X

కుకట్ పల్లి గన్ ఫైర్

Hyderabad: హైదరాబాద్ కూకట్‌పల్లిలో కాల్పుల కలకలం రేపాయి. పట్టపగలే దుండగులు భారీ దోపిడీకి కుట్ర పన్నారు. కూకట్‌పల్లిలోని పటేల్ కుంట పార్కు దగ్గర ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం మిషన్‌లో.. సిబ్బంది డబ్బులు నింపే సమయంలో దుండగులు కాల్పులు జరిపారు.. ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఘటనలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులకు తీవ్రగాయాలయ్యాయి.. వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది..

ఏటీఎం సిబ్బందిపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి నగదును ఎత్తుకెళ్లారు.. చుట్టు పక్కల ఉన్న వారు తేరుకునే లోపు దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్ కి చేరుకుని.. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపి కాల్పులకు తెగబడిన దుండగులకోసం పోలీసులు గాలింపు చేపట్టారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story