నేడు వరంగల్‌ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక.. ఆమెకే మేయర్‌ పదవి..!

Warangal Mayor: వరంగల్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ను మరికొద్ది గంటల్లో ఎన్నుకోనున్నారు.

Arun Chilukuri
Published on: 7 May 2021 10:44 AM IST
Gundu Sudharani Likely to be Crowned Warangal Mayor
X

నేడు వరంగల్‌ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక.. ఆమెకే మేయర్‌ పదవి..!

Warangal Mayor: వరంగల్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ను మరికొద్ది గంటల్లో ఎన్నుకోనున్నారు. హన్మకొండ ఇండోర్ స్టేడియంలో మధ్యాహ్నం 3గంటలకు కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోనున్నారు. కోవిడ్‌ ఉన్న కార్పొరేటర్లకు వీడియో ద్వారా ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం కల్పించారు. ఇప్పటికే టీఆర్ఎస్‌ పార్టీ కార్పొరేటర్లతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమావేశమయ్యారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థులకే మద్దతు తెలపాలంటూ మంత్రి వారికి దిశానిర్దేశం చేశారు. మేయర్ రేసులో గుండు సుధారాణి, ఇండ్ల నాగేశ్వర్‌రావు, గుండేటి నరేందర్, వేముల శ్రీనివాస్ ఉన్నారు. అయితే టీఆర్ఎస్‌ అధిష్టానం సీల్‌ కవర్‌లో మేయర్, డిప్యూటీ మేయర్‌ పేర్లను పంపించింది. దాదాపు మేయర్‌గా గుండు సుధారాణికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story