Siddipet: సిద్ధిపేట జిల్లా సలాక్‌పూర్‌లో గన్ మిస్ ఫైర్.. యువకుడు మృతి

Siddipet: రాత్రి విందు చేసుకున్న ఫజిల్ మేనల్లుడు, 8 మంది స్నేహితులు...

Shireesha
Updated on: 4 Nov 2021 1:30 PM IST
Gun Misfire Killed Young Man in Salakpur Siddipet District | Telugu Online News
X

Siddipet: సిద్ధిపేట జిల్లా సలాక్‌పూర్‌లో గన్ మిస్ ఫైర్.. యువకుడు మృతి

Siddipet: సిద్ధిపేట జిల్లా మద్దూర్ మండలంలో కాల్పుల కలకలం రేపింది. గన్ మిస్ ఫైర్ అవ్వడంతో హైదరాబాద్‌కు చెందిన ముస్లీం యువకుడు మృతిచెందాడు. సలాక్‌ పూర్‌ గ్రామంలో ఫజిల్ అనే వ్యక్తి కొత్త ఇళ్లు కొన్నాడు. ఫజిల్ మేనల్లుడు హైదరాబాద్‌ లంగర్ హౌస్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే ఫజిల్ మేనల్లుడు, 8 మంది స్నేహితులతో కలిసి సలాక్‌పూర్ గ్రామనికి వచ్చారు.

బుధవారం రాత్రి విందు చేసుకునే క్రమంలో గన్‌తో ఫైర్ చేయడంతో అది మిస్ ఫైర్ అయి ముసాఫ్ తలకు బలంగా తగిలింది. వెంటనే సలాక్‌పూర్ నుంచి సిద్ధిపేటకు ఆస్పత్రికి తీసుకొని వెళ్తుండంగా మార్గమధ్యలోనే ముసాఫ్ మృతిచెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story