Kamareddy: కామారెడ్డి జిల్లాలో నాటు తుపాకీ మిస్‌ ఫైర్‌

Kamareddy: నాటు తుపాకీ మిస్‌ ఫైర్‌ కావడంతో వేటగాడు మృతి

Dhatripriya
Updated on: 19 Jan 2023 2:00 PM IST
Gun Misfire In Kamareddy
X

Kamareddy: కామారెడ్డి జిల్లాలో నాటు తుపాకీ మిస్‌ ఫైర్‌

Kamareddy: కామారెడ్డి జిల్లాలో నాటు తుపాకీ మిస్‌ ఫైర్‌ అయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నాటు తుపాకీ మిస్‌ ఫైర్‌ కావడంతో వేటగాడు మృతి చెందాడు. సిరికొండ-మాచారెడ్డి పీఎస్‌ పరిధిలోని అటవీప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మాచారెడ్డి మండలం మర్రితండాకు చెందిన ముగ్గురు వేట కోసం వెళ్లారు. అడవి పందులను వేటాడే క్రమంలో నాటు తుపాకీ మిస్ ‌ఫైర్‌ అయింది. దీంతో రావోజీ అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నాటు తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తు్న్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story