Gummadidala Municipal Results 2026: గుమ్మడిదలలో గులాబీ జెండా రెపరెపలు: 15 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ విక్టరీ.. కాంగ్రెస్‌కు షాక్!

Gummadidala Municipal Results 2026: సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్‌ఎస్‌ (BRS) పార్టీ ప్రభంజనం సృష్టించింది.

Arun Chilukuri
Published on: 13 Feb 2026 12:33 PM IST
Gummadidala Municipal Results 2026: గుమ్మడిదలలో గులాబీ జెండా రెపరెపలు: 15 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ విక్టరీ.. కాంగ్రెస్‌కు షాక్!
X

Gummadidala Municipal Results 2026: సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్‌ఎస్‌ (BRS) పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికల్లో ఓటర్లు గులాబీ పార్టీకే పట్టం కట్టారు. మొత్తం 22 వార్డులకు గాను మెజారిటీ స్థానాలను గెలుచుకుని మున్సిపల్ పీఠాన్ని బీఆర్‌ఎస్‌ సుస్థిరం చేసుకుంది.

పార్టీల వారీగా ఫలితాల సరళి:

మున్సిపాలిటీలోని మొత్తం 22 వార్డుల తుది ఫలితాలు ఇలా ఉన్నాయి:

బీఆర్‌ఎస్‌: 15 వార్డులు

కాంగ్రెస్: 04 వార్డులు

బీజేపీ: 02 వార్డులు

ఇతరులు (ఇండిపెండెంట్): 01 వార్డు

సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చిన బీఆర్‌ఎస్‌, గుమ్మడిదలలో మాత్రం ఏకపక్ష విజయాన్ని అందుకుంది. 15 స్థానాల్లో గెలుపొందడంతో మున్సిపల్ చైర్మన్ పీఠం గులాబీ పార్టీ పరం కావడం ఖాయమైంది. అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం 4 స్థానాలకే పరిమితం కాగా, బీజేపీ రెండు చోట్ల విజయం సాధించింది. ఈ విజయంతో గుమ్మడిదల పట్టణంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీ ఎత్తున విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తూ సంబరాలు చేసుకుంటున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story