Telangana: హైదరాబాద్ అమీర్‌పేటలో గుజరాత్ ఏటీఎస్ తనిఖీలు

Gujarat ATS Raids in Hyderabad
x

Telangana: హైదరాబాద్ అమీర్‌పేటలో గుజరాత్ ఏటీఎస్ తనిఖీలు

Highlights

Telangana: అమీర్‌పేటలోని ఓ కోచింగ్ సెంటర్‌లో సాఫ్ట్‌వేర్‌ ట్రైనర్‌గా పని చేస్తున్న జావెద్

Telangana: హైదరాబాద్ అమీర్‌పేటలో గుజరాత్ ఏటీఎస్ తనిఖీలు చేపట్టింది. నాలుగు కోచింగ్ సెంటర్లలో సీసీ ఫుటేజీ పరిశీలించారు. అమీర్‌పేటలోని ఓ కోచింగ్ సెంటర్‌లో సాఫ్ట్‌వేర్‌ ట్రైనర్‌గా పని చేస్తున్న జావెద్.. కోచింగ్ మాటున ఉగ్రశిక్షణ ఇచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జావెద్ కార్యకలాపాలపై ఏటీఎస్ ఆరా తీస్తోంది.

హైదరాబాద్ పాతబస్తీతో పాటు రామగుండంలో ఏటీఎస్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఇటీవల పోరుబందర్‌లో పట్టుబడ్డ ఐఎస్‌కేపీ ఉగ్రవాదులతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. పట్టుబడ్డ ఐదుగురు ఉగ్రవాదుల్లోని ఒక మహిళకు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఫసీ అనే వ్యక్తితో సంబంధాలు ఉన్నట్లు నిర్ధారించారు.

రామగుండంలో సాఫ్ట్‌వేర్ ట్రైనర్ జావీద్ ఇంట్లో తనిఖీలు చేపట్టిన ఏటీఎస్... జావీద్‌తో పాటు అతని కుమార్తె సుబేరాను అదుపులోకి తీసుకున్నారు. పాతబస్తీవాసి ఫసీతో సంబంధాలపై ఆరా తీయాలని నిర్ణయించారు. శ్రీనగర్‌కు చెందిన నాసీర్‌, హయత్‌, అజీమ్‌లతో ముఠా సభ్యులను సూరత్‌కు పిలిచిన సుబేరా భాను.. ఉగ్ర కార్యక్రమాలకు పాల్పడుతున్న ఫసీని అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories