గూడెం మహిపాల్‌రెడ్డికి ముదిరాజ్‌ల సంపూర్ణ మద్దతు

Gudem Mahipal Reddy: మహిపాల్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్న ముదిరాజ్‌లు

Shekhar G
Updated on: 2 Sept 2023 4:15 PM IST
Gudem Mahipal Reddy Full Support From Mudiraj
X

గూడెం మహిపాల్‌రెడ్డికి ముదిరాజ్‌ల సంపూర్ణ మద్దతు

Gudem Mahipal Reddy: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ముదిరాజులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో ముదిరాజ్‌ సంఘం నాయకులు సమావేశమైంది. మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు శివకుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ముదిరాజ్‌ల అభివృద్ధికి మహిపాల్‌రెడ్డి ఎంతో కృషి చేశారని నేతలు కొనియాడారు. ముదిరాజ్‌లంతా ఐక్యంగా ఉండి రాబోయే ఎన్నికల్లో మహిపాల్ రెడ్డికి అండగా ఉండాలని కోరారు. మహిపాల్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు ముదిరాజ్‌లు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో సర్పంచులు ఆంజనేయులు, సత్యనారాయణ, జనార్ధన్, ఉపసర్పంచ్ నీలం సంజీవ, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

Shekhar G

Shekhar G

Next Story