TSPSC Group 4 Key: గ్రూప్ 4 పరీక్ష ఫైనల్ కీ రిలీజ్.. పది ప్రశ్నల తొలగింపు

TSPSC Group 4 Key: వచ్చే వారం గ్రూప్-4 జనరల్ ర్యాకింగ్ జాబితా జారీ చేసే అవకాశం

Shekhar G
Published on: 7 Oct 2023 11:57 AM IST
TSPSC Group 4 Key: గ్రూప్ 4 పరీక్ష ఫైనల్ కీ రిలీజ్.. పది ప్రశ్నల తొలగింపు
X

TG Groups-1: గ్రూప్​-1 మెయిన్స్​కు లైన్​ క్లియర్.. తొలగిన అడ్డంకి..యాథావిధిగా మెయిన్స్ పరీక్షలు

TSPSC Group 4 Key: తెలంగాణ గ్రూప్-4 ప్రభుత్వోద్యోగ పరీక్షకు సంబంధించి TSPSC ఫైనల్ కీని విడుదల చేసింది. గ్రూప్‌-4 మాస్టర్ ప్రశ్న పత్రంతో పాటూ ఈ కీని విడుదల చేసింది. ఈ సందర్భంగా పేపర్-1, పేపర్-2లోని మొత్తం పది ప్రశ్నలను తొలగించినట్టు పేర్కొంది. పేపర్ 1లోని 11,21, 60, 73, 129, 132, 148 ప్రశ్నలను తొలగించారు. మరో ఎనిమిది ప్రశ్నలకు సమాధానాల్లో మార్పులు చేశారు. 31వ ప్రశ్నకు ఇచ్చిన నాలుగు అప్షన్లలో ఏది ఎంచుకున్నా సరైనదేనని TSPSC ప్రకటించింది. ఇక పేపర్‌-2లో 25,40,78 ప్రశ్నలను తొలగించగా, ఐదు ప్రశ్నల సమాధానాల్లో మార్పులు చేశారు.

జులై 1న గ్రూప్ 4 పోస్టులకు పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం, పరీక్షల్లోని ప్రశ్నలకు సమాధానాలతో కూడిన ప్రిలిమినరీ ఆన్సర్ కీని ఆగస్టు 28న విడుదల చేశారు. దీనిపై అభ్యంతరాలు పరిశీలించిన తరువాత TSPSC తాజాగా తుది కీని విడుదల చేసింది. మరోవారంలో గ్రూప్-4 జనరల్ ర్యాకింగ్ లిస్టును టీఎస్‌పీఎస్‌సీ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఆ తరువాత తుది ఫలితాలను ప్రకటిస్తారు.

Shekhar G

Shekhar G

Next Story