Telangana: తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1ప్రిలిమ్స్

Telangana: నిమిషం నిబంధనతో పలువురు అభ్యర్థులకు తప్పని తిప్పలు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 9 Jun 2024 4:35 PM IST
Group 2 exams as per schedule
X

Group-2 : షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2 పరీక్షలు..గందరగోళంలో నిరుద్యోగులు

Telangana: తెలంగాణలో గ్రూప్ 1ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మొదలైన పరీక్ష మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. తెలంగాణ సంక్షేమ పథకాలతో పాటు కేంద్ర సంక్షేమ పథకాలపై ఎక్కవ ప్రశ్నలు వచ్చాయని అభ్యర్థులు చెబుతున్నారు. ఒక్కో అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం సిబ్బంది ఎగ్జామ్‌ సెంటర్‌లోకి అనుమతించారు. కొందరు అభ్యర్థులు నిమిషం ఆలస్యంగా రావడంతో అనుమతించలేదు. దీంతో నిరాశతో వెనుదిరిగారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 563 పోస్టులను గ్రూప్‌-1 ద్వారా టీజీపీఎస్సీ భర్తీ చేస్తున్నది. ఈ పరీక్ష కోసం 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారికోసం 897 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story