Telangana: నేడు గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష

Telangana: 10.30 నుంచి మద్యాహ్నం ఒంటిగంట వరకూ పరీక్ష

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 9 Jun 2024 11:19 AM IST
Group-1 preliminary exam today
X

 Telangana: నేడు గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష

Telangana: రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి కాసేపట్లో.. ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. ఓఎంఆర్‌ పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్ష కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మంది హాజరుకానున్న ప్రిలిమ్స్‌కు 31 జిల్లాల్లో 897 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోనే 105 కేంద్రాలున్నాయి. ఉదయం 9గంటల నుంచి అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పిన అధికారులు‌... పరీక్ష ప్రారంభానికి అరగంట ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని సూచించింది. 10 గంటల తర్వాత గేట్లు మూసివేస్తామని TGPSC స్పష్టంచేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story