Telangana: విద్యుదాఘాతంతో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మృతి

Telangana: ఇంటికి వెళ్తూ ప్రమాదానికి గురైనా కానిస్టేబుల్

Jyothi
Published on: 1 May 2023 7:47 AM IST
Greyhounds Constable Dies Due to Electrocution
X

Telangana: విద్యుదాఘాతంతో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మృతి

Telangana: విద్యుదాఘాతంతో గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ మృత్యువాతపడ్డాడు. మహబూబాబాద్‌ జిల్లా గంగారాం మండలం పుట్టలభూపతి గ్రామానికి చెందిన సోలెం వీరాస్వామి గండిపేట గ్రేహౌండ్స్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ అదే ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆదివారం రాత్రి యూసుఫ్‌గూడలోని మొదటి పటాలంలో ఉన్న సోదరుడిని కలవడానికి వచ్చి, రాత్రి 9.40కు ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి బయలుదేరాడు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 1 నుంచి ఎన్టీఆర్‌ భవన్‌ వైపు వెళ్లే దారిలో ఫ్రీలెఫ్ట్‌ వద్ద వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న కరెంట్‌ స్తంభాన్ని తాకాడు. వర్షానికి స్తంభానికి కరెంటు సరఫరా జరిగి విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి చేరాడు. స్థానికుల సమాచారంతో పోలీసు వచ్చి అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Jyothi

Jyothi

Next Story