Hyderabad: మొయినాబాద్‌లోని IITA ఆవరణలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్

Hyderabad: 80 ఎకరాల ప్రదేశంలో మొక్కలు నాటి పెంచేందుకు చ‌ర్యలు

Sandeep Eggoju
Published on: 10 July 2021 3:01 PM IST
Green India Challenge at IITA Campus in Moinabad
X

ఐఐటీఏ ఆవరణలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (ఫైల్ ఇమేజ్)

Hyderabad: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ ఆవరణలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యస‌భ స‌భ్యులు సంతోష్ కుమార్, సీఎం ప్రత్యేక కార్యద‌ర్శి రాజ‌శేఖ‌ర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాక‌ర్ రావు, డీఐజీ తాప్సిర్ ఇక్బాల్ తదితరులు పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ట్రైనింగ్ అకాడమీ ఆవరణంలో పచ్చదనం పెంచడం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామన్నిరు అధికారులు. మొత్తం 80 ఎకరాల్లో చెట్లను నాటి పెంచేందుకు చ‌ర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మొక్కల‌కు నీరు అందించేందుకు అకాడ‌మీ ఆవ‌ర‌ణ‌లో రెండు ఇంకుడు గుంత‌లు ఏర్పాటు చేశామ‌న్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story