హంగ్‌ దిశగా గ్రేటర్ హైదరాబాద్‌ ఫలితాలు

గ్రేటర్ హైదరాబాద్‌ ఫలితాలు హంగ్‌ దిశగా వస్తున్నాయి. GHMC ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్‌ అవతరించినప్పటికీ, ఫైనల్‌గా 60లోపు డివిజన్లలో మాత్రమే విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది.

admin
Published on: 4 Dec 2020 6:41 PM IST
హంగ్‌ దిశగా గ్రేటర్ హైదరాబాద్‌ ఫలితాలు
X

గ్రేటర్ హైదరాబాద్‌ ఫలితాలు హంగ్‌ దిశగా వస్తున్నాయి. GHMC ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్‌ అవతరించినప్పటికీ, ఫైనల్‌గా 60లోపు డివిజన్లలో మాత్రమే విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. అయితే, 65 సీట్లలో కచ్చితంగా గెలిస్తేనే టీఆర్ఎస్‌ సొంతంగా మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఏ పార్టీకి మేయర్ పీఠం దక్కాలన్నా 100మంది సభ్యుల బలం అవసరం. అయితే, గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ప్రస్తుతం 35మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు ఉన్నారు. ఈ లెక్కన చూస్తే, 65 డివిజన్లను గెలుచుకుంటేనే టీఆర్ఎస్‌‌కు సొంతంగా మేయర్ పీఠం దక్కుతుంది. లేదంటే, ఇతరుల సహాయం తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.

admin

admin

Next Story