కోలుకుంటున్న ఆర్టీసీ

కోలుకుంటున్న ఆర్టీసీ
x
Highlights

కొవిడ్‌ కారణంగా హైదరాబాద్ నగరంలో ఆరు నెలలుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు గత కొద్దిరోజులుగా నగరవాసులకి సేవలందిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే బస్సుల్లో...

కొవిడ్‌ కారణంగా హైదరాబాద్ నగరంలో ఆరు నెలలుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు గత కొద్దిరోజులుగా నగరవాసులకి సేవలందిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే బస్సుల్లో ప్రయాణికులు కనిపించి అక్యూపెన్సీ 47 శాతం నుంచి 50 శాతానికి పెరిగిందని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెప్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ లో ఆర్టీసీకి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. నగరంలో గత సోమవారం ఒక్కరోజే 90 లక్షల ఆదాయం ఆర్టీసీకి సమకూరినట్టు ఉన్నతాదికారుల చెప్తున్నారు. రోజుకు తక్కువలో తక్కువగా 40 - 70 లక్షల మధ్య ఆదాయం లభిస్తుంది. నగరంలో కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా 25 శాతం బస్సులు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 135 రూట్లలో డిపోకు పది, పన్నెండు చొప్పున బస్సులు తిరుగుతున్నాయి.

గత నెల 26 నుంచి రోడ్డెక్కిన సిటీ బస్సులకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. మొదట్లో 15-20 శాతం మాత్రమే సీట్లు నిండగా ఇప్పుడు 50 శాతానికి ఆక్యుపెన్సీ రేషియో చేరింది. దీంతో మరిన్ని బస్సులు నడిపే ప్రతిపాదనలపై ఆర్టీసీ గ్రేటర్‌ జోన్‌ దృష్టిపెట్టింది. లాక్‌డౌన్‌ అనంతరం సిటీ బస్సులు తిరగడం మొదలైన తర్వాత తొలి రెండురోజులు దాదాపు 4 లక్షలకే ప్రయాణికుల సంఖ్య పరిమితమైంది. ఆదాయం రూ.10 లక్షల వరకు వచ్చేది. ఈనెల 6 నాటికి రోజువారీ ప్రయాణికుల సంఖ్య దాదాపు 12 లక్షలకు చేరింది. ప్రస్తుతం కోఠి-పటాన్‌చెరు, సికింద్రాబాద్‌-ఈసీఐఎల్‌, బాలానగర్‌, మేడ్చల్‌ తో పాటు 30 మార్గాల్లో ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. రద్దీ మేరకు అప్పటికప్పుడు సర్వీసులు పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే గతంలో ఐటీ ఉద్యోగులు అధికంగా ఉండే సికింద్రబాద్ - కొండాపూర్ రూట్ ప్రయాణికులతో రద్దీగా ఉండేది. ప్రస్తుతం వారంత వర్క్ ఫ్రమ్ హోం చేస్తుండడతో టెన్ కే రూటులో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఇప్పటికే 25 శాతం నడుస్తున్న బస్సుల్లో రద్దీ పెరుగుతున్న దృష్య త్వరలోనే మరిన్ని బస్సుల పెంపుదలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories