ఏడుపదుల వయస్సులో కుటుంబ భారం మోస్తున్న అవ్వ

Nizamabad: నిజామాబాద్ జిల్లా ఎడపల్లికి చెందిన గంగవ్వకు బాసటగా నిలిచిన పూర్ సంస్థ

Jyothi
Published on: 1 Jun 2022 9:10 AM IST
Grandmother Carrying The Burden Of The Family At The Age Of Seventy
X

ఏడుపదుల వయస్సులో కుటుంబ భారం మోస్తున్న అవ్వ

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో ఏడు పదుల వయస్సులోనూ కుటుంబ భారాన్ని మోస్తున్న అవ్వపై పై హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన అయ్యో అవ్వ కథనానికి స్పందన లభించింది. ఎడవల్లి మండల కేంద్రంలో దీనస్థితిలో జవనం సాగిస్తున్న ఒక కుటుంబంపై ప్రసారమైన ప్రత్యేక కథనానికి పూర్ సంస్థ సంస్థ స్పందించింది. సంస్థ చైర్మన్ సంధ్య గోళ్లముడి ఆ కుటుంబానికి చేయూతనిచ్చారు. మూడు నెలల క్రితం ఆ కుటుంబానికి సరిపడ సరుకులు, బట్టలు అందించారు. తాజాగా ఎడపల్లి గంగవ్వ ఇంటికి చేరుకొని వీల్ చైర్, కూరగాయల తోపుడు బండి, సెల్ ఫోన్ అందించారు.

పేదరికంతో జీవనం సాగిస్తున్న గంగవ్వ కుటుంబాన్ని పూర్ సంస్థ సహాయం అందించడం పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు కొనియాడారు. హైదరాబాద్ నుండి నిజామాబాద్ జిల్లా ఎడపల్లికి వచ్చి సహాయం చేసిన పూర్ సంస్థ చైర్మన్ సంధ్య గొళ్లముడిని ఎంపీపీ శ్రీనివాస్, ఎస్సై పాండేరావు, సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ సహా పలువురు అభినందించారు.

Jyothi

Jyothi

Next Story